కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతం

కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతం

హైదరాబాదు: ”హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం.. నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం.. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా తప్పితే.. రాజకీయాల కోసం కాదు.. ప్రజావసరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరిచింది.. రానున్న రోజుల్లో కంటోన్మెంట్ను అభివృద్ధి చేస్తాం..” అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పర్యటించిన సీఎం, జవహర్నగర్ ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతక్సోవంలో పాల్గొన్న అనంతరం సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలోని జాతీయ రహదారి (ఎస్హెచ్01) ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల అవసరాన్ని మరిచిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాజీవ్ రహదారి (ఎస్హెచ్01) ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పక్కన పెట్టిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసి, ఈ ప్రాజెక్టు అవసరాన్ని వివరించి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఈ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. అలాగే మేడ్చల్ ప్రాంతంతోపాటు ఉత్తర తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారంగా నిలుస్తుందని చెప్పారు. భూముల కేటాయింపు, చాంద్రాయణ గుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేసిందనీ, తాము అధికారంలోకి రాగానే తక్షణమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామనీ చెప్పారు. కేంద్రాని కి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం పరస్పరం సహకరించుకోవడం వల్లే ఈ సమస్య త్వరగా పరిష్కారమైందన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గంజా యి, డ్రగ్స్, పబ్బులు పెరిగాయి తప్పితే నగరాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos