ఐదు చోట్ల ఆరున తిరిగి పోలింగ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 6న ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఈ పోలింగ్‌ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా పరిగణించి వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సిద్ధంగా ఉంచుతామని చెప్పారు.మొరాయించిన ఇవిఎంల్‌ను అప్పటి కప్పుడు మరమ్మతుచేసేందుకు ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బెల్ సంస్థ ఇంజినీర్లు కూడా ఉంటారన్నారు. సీసీ కెమెరాల ద్వారా పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని నల్లచెరువు 244 నెంబరు కేంద్రం లో శాంతిభద్రతల సమస్యతలెత్తినందునే రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి 94వ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ జరగదంటూ ఎన్నికల అధికారి కటించడంతో ఓటర్లు వెనుదిరిగారన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల 247నెంబరు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించటంతో సుమారు 50 మంది ఓటు హక్కు చలాయించలేదని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్‌సిబ్బంది చేసిన పొరపాటు వల్ల రీపోలింగ్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇసుకపల్లి – పల్లెపాలెం 41 నెంబరు, అటకాని తిప్ప 197 నెంబరు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహిస్తున్నామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos