రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ

రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ

ముంబై: కరోనాతో కూలుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం పలు రాయితీల్ని ప్రకటించింది. ఆర్బీఐ, రెపో రేటును ముప్పావు శాతం తగ్గించినట్లు బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ ఇక్కడ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. రివర్స్ రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గించామన్నారు. అధిక మొత్తంలో వడ్డీ రేటు ను తగ్గించటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. రెపో రేటు 4.4 శాతానికి చేరింది. బ్యాంకులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుందన్న ఉద్దేశంతోనే రెపో, రివర్స్ రెపోల మధ్య వ్యత్యాసాన్ని పెంచామని వివరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపైనా కన్నేసి ఉంచామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos