నా పిల్లల్లో ప్రవహించేది పవన్ రక్తం కాదు..

  • In Film
  • December 30, 2019
  • 135 Views
నా పిల్లల్లో ప్రవహించేది పవన్ రక్తం కాదు..

పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారు.వ్యక్తిగత ఫోటోలు,సమాచారాన్ని,వృత్తిపర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ తరచూ చాటింగ్‌ చేసే రేణూదేశాయ్‌ తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎప్పటిలాగే తాజాగా అకీరా తన చెల్లి ఆధ్యను ఎత్తుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోతో పాటు 1 2 3 అని లెక్కించే లోపు నీ ముందు ఉంటాను. ఇద్దరు క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరికి నేనున్నాను వారు నా సొంతం అంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్ట్ చేసింది. ఫొటోకు ఒక నెటిజన్ స్పందిస్తూ ఎంతైనా వారిద్దరిలో ఉన్నది పవన్ కళ్యాణ్ రక్తం కదా అన్నట్లుగా కామెంట్ చేశాడు. కామెంట్ పై రేణు దేశాయ్ కౌంటర్ గా స్పందించింది. మీకు సైన్స్ సరిగా తెలుసో తెలియదో టెక్నికల్ గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించే రక్తం నాది. మీకు సైన్స్ తెలిస్తే అలా మాట్లాడి ఉండరు అంటూ అతడి కామెంట్ కు సమాధానం గా రిప్లై ఇచ్చింది. రేణు రిప్లై కు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కొందరు సమర్ధిస్తే మరి కొందరు వ్యతిరేకించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos