రెమ్​డెసివిర్ అక్రమ నిల్వ పనిలో ఫడణవీస్

న్యూ ఢిల్లీ: మహారాష్ట్ర విపక్ష నేత ఫడణవీస్.. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారని ఆరోపించారు .కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు . వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అందరూ కోరుతుంటే.. భాజపా నేత ఈ ఔషధాలను దాచిపెట్టే పనిలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. “రెమ్డెసివిర్ అందు బాటులో ఉంచాలని దేశంలోని ప్రజలందరూ కోరుతుంటే, ఒక్క బాటిల్ రెమ్డెసివిర్ కోసం చాలా మంది తిప్పలు పడుతుంటే.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ భాజపా నేత ఆ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరం” అని ట్విట్టర్ లో దుయ్యబట్టారు . నగరంలోని విలే పార్లే, మలాడ్, కాందివలి, దక్షిణ ముంబయి వంటి పలు ప్రదేశాల్లో దాదాపు 60 వేల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్రూక్ ఫార్మా సంస్థ అక్రమంగా నిల్వ చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణతో ఆ ఫార్మా సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు విచారిస్తున్న వారిని రక్షించడానికి ప్రతిపక్షనేత ఫడణవీస్ వెళ్లారని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos