గృహ నిర్బంధం నుంచి నేతలకు విముక్తి

గృహ నిర్బంధం నుంచి నేతలకు విముక్తి

శ్రీనగర్ : మండల అభివృద్ధి మండలి ఎన్నికలు సమీపించినందున కేంద్ర ప్రభుత్వం జమ్ములో గృహ నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలందరినీ బుధవారం విడుదల చేసింది. వీరిపై విధించిన ఆంక్షలు, నియంత్రణల్ని ఎత్తి వేశారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత కేంద్రం మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతలను గృహ నిర్బంధం చేసింది. తాజా నిర్ణయంతో దేవేందర్ సింగ్ రాణా (నేషనల్ కాన్ఫరెన్స్) హర్షదేవ్ సింగ్ (నేషనల్ ప్యాంథర్స్ పార్టీ) రామన్ భల్లా (కాంగ్రెస్) సహా పలువురు నేతలకు విముక్తి లభించింది. స్ధానిక సంస్థ ఎన్నికల్లో పాల్గొనేందుకు రాజకీయ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ విడుదల చేయాలని జమాతే ఇస్లామి హింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జమ్ము కశ్మీర్లోని 310 మండల అభివృద్ది మండళ్లకు అక్టోబర్ 24న ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos