జారుడు బల్ల పై రూపాయి

జారుడు బల్ల పై రూపాయి

ముంబై: అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి బక్క చిక్కుతోంది. మంగళవారం డాలర్ మారకంలో రూపాయి 14 పైసలు నష్ట పోయి 77.69 వరకు జారింది. ఇది కొత్త కనిష్ఠ స్థాయి. గత శుక్రవారం రూపాయి విలువ డాలర్ తో .77.55 దీన్ని కోల్పోయింది. చైనా నుంచి వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు కొత్త ఆందోళనలకు దారితీశాయి. ఇది అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఇది వర్ధమాన దేశాల కరెన్సీలపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు అంటున్నారు. అమెరికా సైతం మాంద్యానికి సమీపంలో ఉందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో వైపు పెరిగిపోయిన సరకుల ధరలతో ద్రవ్యోల్బణం అదుపుతప్పి గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రతి కూల పరిస్థితుల నడుమ భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయిని బలహీనపరుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos