ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్కు మరో దెబ్బ తగిలింది. బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నివృతి వేళకు ఆరు నెలలు ముందుగానే పదవి నుంచి వైదొలగటం చర్చనీయాం శమైంది. 2017, జనవరి 23న ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన న్యూయార్క్లోని స్టెర్న్ స్కూల్లో ఆచార్యులుగా బాధ్యతలను చేపట్టనున్నారని తెలుస్తోంది. నిరుడు డిసెంబరులో బ్యాంకు గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన విషయం విదితమే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos