రాయపాటి నివాసంలో సిబిఐ సోదాలు

రాయపాటి నివాసంలో సిబిఐ సోదాలు

గుంటూరు: తెదేపా నేత రాయపాటి సాంబశివరావు ఇక్కడి నివాసంలో శుక్రవారం సీబీఐ సోదాలు చేపట్టింది. పలు కీలక దస్త్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. బ్యాంకు రుణాలు ఎగ్గోట్టారు అనే ఆరోపణలపై రాయపాటి కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో రెండుసార్లు సోదాలు చేసి కొంత సమాచారాన్ని సేకరించారు. ఈ కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దరిమిలా రాయపాటి ఇల్లు, కార్యాలయం తో పాటుగా శ్రీధర్ ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. నకిలీ పాస్పోర్ట్తో శ్రీధర్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాయపాటి కుటుంబసభ్యులు సిబిఐకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రాయపాటి ఇండియన్ బ్యాంక్ కు రూ.300కోట్లు రుణ బకాయిని చెల్లించకపోవడం సీబీఐ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos