అనుమానాలు తీరిస్తేనే శివసేన ఓటు

అనుమానాలు తీరిస్తేనే శివసేన ఓటు

న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదా విషయంలో తమ పార్టీ అధినేత చీఫ్ ఉద్ధవ్ థాకరే లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే రాజ్యసభలో ముసాయిదాకు తమ మద్దతు ఉంటుందని శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఓటు బ్యాంకు రాజకీ యాలు అన్నివేళలా పని చేయవు. అది సరికూడా కాదు. హిందూ-ముస్లింలను మళ్లీ విడగొట్టే ప్రయ త్నాలు చేయరాదు. శ్రీ లకంలోని తమిళ హిందువుల ప్రస్తావన కూడా ముసాయిదాలో లేదు. లోక్సభలో మద్దతుకు, రాజ్యసభలో మద్దతుకు తేడా ఉంది. లోక్సభలో ఏ నిర్ణయం తీసుకున్నామనేది ఇక్కడ ప్రధానం కాదు. రాజ్యసభలో శివసేన మద్దతు చాలా కీలకం. చర్చలో ఏమి చెబుతారో విన్న ఆ తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos