సినిమా వసూళ్లు ఆర్థిక స్థితికి అద్దం పట్టవు

సినిమా వసూళ్లు ఆర్థిక స్థితికి అద్దం పట్టవు

ముంబై: ‘దేశ ఆర్థిక వ్యవస్థకు సినీ పరిశ్రమ చాలా తక్కువ స్థాయిలో- కేవలం ఒకటి లేదా రెండు శాతం మాత్రమే సాయం చేస్తోంద’ని సినీ వ్యాపారి కోమల్ నహతా సోమవారం విశ్లేషించారు. సినీ పరిశ్రమ తన వ్యాపారంలో సాధించే కలెక్షన్లు ఎల్లప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. దేశ ఆర్థిక స్థితికి అంతగా సాయం చేయవు’ అన్నారు. ‘ఒకే రోజు విడుదలైన మూడు సినిమాలు రూ.120 కోట్లు సంపాదించాయని, దీంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యానం విమర్శలకు గురైంది. ‘సినిమాల కలెక్షన్ల విషయంలో రవి శంకర్ ప్రసాద్ చెప్పింది నిజమే. ఒకేరోజు రూ.120 కోట్లు రాబట్టడం సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంతకు ముందు బాహుబలి 2 ఒకే రోజు రూ.112 కోట్లు రాబట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సినీ పరిశ్రమ చాలా తక్కువ స్థాయిలో సహకారం అందిస్తుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos