టీవీ9 నుంచి రవి రవిప్రకాష్ కు ఉద్వాసన??

పలు భాషల్లో మీడియా రంగంలో టీవీ9ను అగ్రగామిగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన రవి రవిప్రకాష్ ను సీఈఓ పదవి నుంచి తొలగించడానికి టీవీ9 యాజమన్యాం నిర్ణయించుకున్నట్లు సమాచారం.మెజారిటీ వాటాదారుల హక్కుల అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు రవిప్రకాష్ పాల్పడ్డారని అలంద సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు ఆరోపించారు.టీవీ9లో 90శాతం వాటాలు దక్కించుకున్నా తమ నిర్వహణకు రవి ప్రకాశ్ అడ్డుపడుతూ కంపెనీల చట్టంలోని నిబంధనలను వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ కొత్త యాజమాన్యం రవిప్రశాశ్ పై ఆరోపణలు చేస్తోంది. . సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది.ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్గా ఎదిగిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. ఏబీసీఎల్ లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకొంది. కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని కూడ అలంద మీడియా ఎంటర్టైన్మెంట్ కార్యదర్శి కౌశికర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం నాడు రవిప్రకాష్ ఇంట్లోనూ, కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.సంస్థ ప్రయోజనాలకు సంబంధించి రవిప్రకాష్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడ పెట్టింది.అయితే రవి రవిప్రకాష్ ను సీఈఓ పదవి నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos