తన కథ తనే రాసుకుంటున్న రవితేజ..

  • In Film
  • May 9, 2019
  • 152 Views
తన కథ తనే రాసుకుంటున్న రవితేజ..

తెలుగు చిత్ర పరిశ్రమలో కిందిస్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన నటుల జాబితాలో రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది.పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో హీరోలకు అసిస్టెంటుగా,దర్శకులకు సహాయకుడిగా పని చేసి తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకొని అటుపై హీరోగా వరుసగా అవకాశాలు దక్కించుకొని స్టార్హీరో అయ్యారు.ఎంత స్టార్ హీరో అయినా చాలా సార్లు తాను నటించిన కొన్ని సినిమాలకు సీన్స్ అందించటం, డైలాగ్స్ స్వయంగా చెప్పటం వంటివి చేస్తూ వస్తున్నారు.కిందిస్థాయి నుంచి వచ్చిన రవితేజకు దర్శకుల కష్టం గురించి తెలుసు కాబట్టే దర్శకనిర్మాతనలను ఎప్పుడు ఇబ్బందులకు గురి చేయలేదు.అందుకే రవితేజపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎటువంటి ఆరోపణలు రాలేదు.అయితే కొద్ది కాలంగా ఒక హిట్టు రెండు ఫట్టు అనే విధంగా రవితేజ కెరీర్ కొనసాగుతోంది.దీంతో చాలా కాలం తరువాత తన లోని రచయితను రవితేజ బయిటకు తీస్తున్నారని సమాచారం. తనే ఓ స్క్రిప్టు రాసి, తనకు బాగా సన్నిహితులైన ఓ డైరక్టర్ చేత డైరక్షన్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు స్క్రిప్టు రైటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. రవితేజ చెబుతుంటే ఇద్దరు రైటర్స్ వాటిని కాగితంపైకి ఎక్కిస్తున్నారని సినీ వర్గాల్లో వినపడుతోంది.రవితేజ క్యారక్టరైజేషన్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది.కెరీర్ విషయానికి వస్తే… వరస పరాజయాల్లో ఉన్న రవితేజ తన తాజా చిత్రం డిస్కో రాజా షూటింగ్ బిజిలో ఉన్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం కు బడ్జెట్ సమస్యలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటికీ నిర్మాతలు తమ తదుపరి షెడ్యూల్ డిటేల్స్ ప్రకటించినా రూమర్స్ ఆగటంలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos