ముంబైలో ఉండడంతో ఆ వ్యాఖ్యలు చేశా..

ముంబైలో ఉండడంతో ఆ వ్యాఖ్యలు చేశా..

దేశంలో ఆర్థిక మాంద్యం లేదనడానికి ఈనెల 3వ తేదీన విడుదలైన మూడు భారీ చిత్రాలు సాధించిన వసూళ్లే నిదర్శనమంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు.శనివారం ముంబైలో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు కేవలం చిత్రాలకు సంబంధించిన అంశమని, ఇందులో తప్పులేదని, భారీ సినిమాలు నిర్మిస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న భారత పరిశ్రమను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు. అందులో భాగంగా అక్టోబర్ 2న ఒకరోజులో మూడు సినిమాలు రూ.120 కోట్లు వసూలు చేశాయని ముంబైలో చెప్పానని, ఇప్పటి వరకు ఇది అత్యధికమని, తాను సినిమా రాజధాని అయిన ముంబైలో ఉన్నా కాబట్టి ఆ విషయం చెప్పానని అన్నారు.భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను తాను వివరంగా చెప్పానని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోణంలో ఆలోచిస్తుందని చెప్పారు. ప్రజల సున్నితత్వం గురించి ఆలోచిస్తుందన్నారు. తాను ముంబైలో మీడియాతో మాట్లాడిన ఇంటరాక్షన్ వీడియో మొత్తం తన సోషల్ మీడియా వేదికలో అందుబాటులో ఉందన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయినా ఎవరైనా వాటిని తప్పుగా భావిస్తే ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos