జైరాకు నాటి హీరోయిన్‌ చురకలు..

  • In Film
  • July 1, 2019
  • 142 Views
జైరాకు నాటి హీరోయిన్‌ చురకలు..

నటించిన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న నటి జైరా వాసీం మరోసారి వార్తల్లో నిలిచారు.బాలీవుడ్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నానంటూ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన జైరా అందుకు దారి తీసిన పరిస్థితులను పోస్ట్‌లో పేర్కొన్నారు.హిందీ చిత్ర పరిశ్రమకు నేను సరిపోయినప్పటికీ కేవలం ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు.అయితే జైరా పోస్ట్ పెట్టిన కాసేపటికే విషయం కాస్త వైరల్ కావడం సినిమాల నుండి తప్పుకోవడానికి గల కారణాన్ని మతంతో ముడిపెట్టి చెప్పడం పలువురిని అసహనానికి గురి చేసింది.తాను కొనసాగుతున్న రంగం తన మాట విశ్వాసాలకు అడ్డుగా తగులుతోందని.. అందుకే సినిమాలకు దూరమవుతున్నానని చెప్పింది జైరా వాసిం. దీనిపై బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.కొందరు జైరాని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం జైరాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి రవీనా టాండన్.. జైరాఫై తన కోపాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ రూపంలో  షేర్ చేశారు.రెండు సినిమాలకే సినిమా ఇండస్ట్రీపై ఇలాంటి ప్రతికూల అభిప్రాయాన్ని పెంచుకునేవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రవీనా రాసుకొచ్చారు. ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇండస్ట్రీ నచ్చకపోతే స్వచ్చందంగా తప్పుకోవచ్చని.. కానీ ఇలా ఇతరుల్లో చిత్ర పరిశ్రమపై తప్పుడు అభిప్రాయాలు కలిగే విధంగా కామెంట్స్ చేయకూడదని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.జైరా తన ఖాతాలో పేర్కొన్న విషయాన్ని పరిశీఇస్తే..ఐదు సంవత్సరాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నేను బాలీవుడ్ చిత్ర సీమలో అడుగు పెట్టినపుడు మంచి గుర్తింపు, పాపులారిటీ వచ్చింది. ఎంతో మంది నన్ను ఆదరించారు. యువతకు రోల్ మోడల్‌గా పేర్కొన్నారు. పరిశ్రమ నాకు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రేమను, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో నేను కొన్ని ఊహించని పరిణామాలు కూడా ఎదుర్కొన్నాను. అదే ఈ ఇండస్ట్రీపై నమ్మకం కోల్పోయేలా చేసింది. ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు, బెదిరింపులు ఎదురొన్నట్లు… జైరా వాసిం తెలిపారు.ఈ పరిణామాలతో ఇక్కడ నేను ఫిట్ అయినప్పటికీ, ఈ పరిశ్రమలో ఉండాల్సిన వ్యక్తిని కాదు అని అర్థమైంది… అని జైరా వాసిం చెప్పుకొచ్చారు.నిజానికి ఈ నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయట పడేందుకు ప్రయత్నించినప్పటికీ నా వల్ల కావడం లేదు. ఈ విషయంలో నేను పూర్తిగా ఓడిపోయాను. నాలోని ప్రశాంతతను, నా విశ్వాసాలను, అల్లాతో నా సంబంధం చెడిపోయే విధంగా ఉన్న ఈ వాతావరణంలో ఉండలేక పోతున్నాను. అందుకే నటనకు స్వస్థి చెప్పి బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జైరా వాసిం తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos