శనివారం రైతుల రస్తా రోకో

శనివారం రైతుల రస్తా రోకో

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా రోడ్లన్నీ దిగ్బంధించాలని మంగళవారం రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. బడ్జెట్ పైనా రైతులు అసంతృప్తితో ఉన్నారు. ‘బడ్జెట్లో మమ్మల్ని విస్మరించారు’ అని అంటూ రైతులు తమ అసంతృప్తిని వెల్లడించారు. ఇక జనవరి 26న జరిగిన విధ్వంసం తర్వాత ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని రైతులు తప్పు పట్టారు. ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిరసన జరుగుతున్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేసి, వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని మోహరించ డాన్ని ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న తమ నిరసనను విధ్వంసం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos