విజయాలతో పాటు..వివాదాలు కూడా..

  • In Film
  • March 25, 2019
  • 120 Views
విజయాలతో పాటు..వివాదాలు కూడా..

కొడగు అందం రష్మిక మందన్నకు విజయాలతో పాటు వివాదాలు కూడా వద్దనకుండా వరిస్తున్నాయి .కిరిక్‌పార్టీతో వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత,నటుడు రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడ్డ రష్మిక అప్పట్లో రక్షిత్‌ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.అయితే తెలుగులో ఛలో,గీతగోవిందం చిత్రాలు బ్లాక్‌బస్టర్లు కావడంతో రష్మికకు అన్ని భాషల్లో విపరీతమైన డిమాండ్‌ వచ్చేసింది.దీంతో కెరీర్‌పై దృష్టి సారించిన రష్మిక రక్షిత్‌శెట్టితో చేసుకున్న నిశ్చితార్థం రద్దు చేసుకుంది.ఇక్కడి నుంచి మొదలైంది రష్మికపై ట్రోలింగ్‌..రిషబ్‌శెట్టిని వదిలేసిందనందుకు కన్నడ సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రష్మికను విపరీతంగా ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు.అదే సమయంలో గీత గోవిందంలో లిప్‌లాక్‌ సన్నివేశాలు కూడా లీకవడంతో ట్రోలింగ్‌ తారాస్థాయికి చేరుకుంది.కొద్ది రోజులకు ట్రోలింగ్‌ కొద్దిగా తగ్గినట్లు కనిపించినా కొద్ది రోజుల క్రితం రష్మిక,విజయ్‌ దేవరకొండ రెండవసారి నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం టీజర్‌ విడుదలయ్యాక మరోసారి రష్మిక ట్రోలింగ్‌కు గురైంది.డియర్‌ కామ్రేడ్‌లో కూడా లిప్‌లాక్‌ సన్నివేశం ఉండడమే అందుకు కారణం.పుండు మీద కారం చల్లినట్లు రష్మిక తాజాగా చేసిన ట్వీట్‌ కన్నడ సినీ అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేసింది.ప్రస్తుతం నేను అనుభవిస్తున్న రోజులు నిజంగా ప్రేమతో కూడుకున్న రోజులుగా అనిపిస్తున్నాయని ఈ క్షణాలు స్వచ్ఛమైన ప్రేమను పరీక్షిస్తున్నాయని ప్రస్తుతం నన్ను ఎవరు ఎంతగా ప్రేమిస్తున్నారో..నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమవుతోందని వారు కూడా నా ప్రేమను పొందడానికి అర్హులంటూ పోస్ట్‌ చేసింది.ఈ ట్వీట్‌పై కన్నడ సినీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అంటే రక్షిత్‌శెట్టి ప్రేమ నిజం కాదా?మీరు విడిపోవడానికి నిజమైన ప్రేమ లేకపోవడమా?విజయ్‌ దేవరకొండతోతో డేటింగ్‌లో ఉండడం వల్ల ఇటువంటి కమెంట్లు చేస్తున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.మరి కొంతమంది రక్షిత్‌శెట్టి వల్లే నీకు ఈ గుర్తింపు వచ్చిందని నువ్వు మంచిదానివైతే ఇటువంటి ట్వీట్లు చేయవని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా నీతో విడిపోయాక రక్షిత్‌శెట్టి నీ గురించి ఇలా ఒక్కసారి కూడా ట్వీట్‌ చేయకుండా హుందాగా ప్రవర్తించాడని నేను కానీ రక్షిత్‌ స్థానంలో నిన్ను ఉరేసి ఉండేవాడినంటూ ట్వీట్‌ చేశాడు.విజయ్‌తో ప్రేమలో ఉండడం వల్లే ఇటువంటి ట్వీట్‌ చేశావంటూ నెటిజన్ల ఆరోపించారు.దీనిపై రష్మిక స్పందిస్తూ..తనకు,విజయ్‌కు మధ్య ఏవేవో సృష్టించొద్దని గీతగోవిందం,డియర్‌ కామ్రేడ్‌ చిత్రాల్లో కథ డిమాండ్‌ మేరకే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించానని అంతమాత్రాన విజయ్‌తో ప్రేమలో ఉన్నానంటూ ఊహించుకోవడం సముచితం కాదన్నారు.చిన్న టీజర్‌ చూసి సినిమాను జడ్జ్‌ చేయకూడదని విజ్ఞప్తి చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos