రష్మిక మందన్నపై కారాలుమిరియాలు నూరుతున్న కన్నడిగులు..

  • In Film
  • July 24, 2019
  • 273 Views

కన్నడ సినీ ప్రేక్షకులు మరోసారి రష్మిక మందన్నపై కారాలు మిరియాలు నూరుతున్నారు.కన్నడ పోరాట సంఘాలైతే ఒక అడుగు ముందుకేసి రష్మికను కన్నడ చిత్ర పరిశ్రమలో నిషేధించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు.దీనంతటికి కారణం ఓ ఇంటర్‌వ్యూలో రష్మిక చేసిన వ్యాఖ్యలు.రష్మిక మందన్న నటించిన కొత్త చిత్రం డియర్‌ కామ్రేడ్‌ ప్రచారాల్లో భాగంగా ఇటీవల చెన్నైకి వెళ్లిన రష్మిక అక్కడి మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా యాంకర్‌ అడిగిన ఓ ప్రశ్నకు తనకు కన్నడ భాష సరిగా రాదని కన్నడ భాష సరిగ్గా మాట్లాడలేనంటూ వ్యాఖ్యానించారు.దీంతో కన్నడ సినీ ప్రేక్షకులు,కన్నడ పోరాట సంఘాలు రష్మికపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.కర్ణాటకలో పుట్టిపెగిరి కన్నడ మాట్లాడడం రాదంటూ చెప్పడం కన్నడ భాషను అవమానించినట్లేనని ఫైర్‌ అవుతున్నారు.కన్నడ భాషపై నీకు గౌరవం లేక పోవడం వల్లే ఇలా తయారయ్యావు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.రష్మిక మందన్న వ్యాఖ్యల వల్లడియర్ కామ్రేడ్చిత్రం కన్నడ రిలీజ్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇష్యూ పెద్దగా అవ్వకుండా నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరం అయితే రష్మికతో క్షమాపణలు కూడా చెప్పించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో కూడా హీరో,నిర్మాత రక్షిత్‌శెట్టితో చేసుకున్న నిశ్చితార్థం రద్దు చేసుకోవడంతో కన్నడిగులు రష్మికపై ఒకరేంజులో ఫైర్‌ అయిన విషయం తెలిసిందే..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos