కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఘనత

  • In Sports
  • September 5, 2019
  • 154 Views
కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఘనత

ఢిల్లీ : ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో పిన్న వయసు కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ గురువారం మొదలైంది. ఈ మ్యాచ్‌లో తన జట్టుకు రషీద్ ఖాన్ నాయకత్వం వహించాడు. ఇప్పుడు అతని వయసు 20 ఏళ్ల 350 రోజులు. జింబాబ్వే క్రికెటర్ తైబు 2004లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచుకు నాయకత్వం వహించినప్పుడు అతని వయసు 20 ఏళ్ల 358 రోజులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos