కేరళ, జమ్మూకశ్మీర్‌లో నేడే రంజాన్..రేపు దేశవ్యాప్తంగా

కేరళ, జమ్మూకశ్మీర్‌లో నేడే రంజాన్..రేపు దేశవ్యాప్తంగా

హైదరాబాద్ : రంజాన్ మాసం కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా ముస్లిం సోదరులంతా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలుంటున్నారు. ఇక నెల రోజుల ఉపవాసాలకు ముగింపుగా జరుపుకొనే రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) గురువారం దేశవ్యాప్తంగా జరగనుంది. అయితే కేరళ, జమ్మూకశ్మీర్ – లద్దాఖ్లలో మటుకు బుధవారమే నిర్వహిస్తున్నారు. బుధవారం యధాప్రకారం 30వ ఉపవాసం ఉంటుందని, గురువారం ఈద్ జరుపుకోవాలని ఢిల్లీలోని ఫతేపురి మసీదు ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ అన్నారు. ఢిల్లీలోని షాహీ జామా మసీదు మాజీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ సైతం దేశంలో ఎక్కడా నెలవంక కనిపించనందున గురువారమే ఈద్ ఉంటుందని తెలిపారు. లక్నోకు చెందిన మర్కజీ చాంద్ కమిటీ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. కేరళ, జమ్మూకశ్మీర్ల స్థానిక ఆధ్యాత్మిక గురువులు మాత్రం చంద్రుడు కనిపించినట్లుగా భిన్నమైన ప్రకటన చేయడం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో నెలవంక దర్శనాన్నిబట్టి ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు రోజుల్లో ఈదుల్ ఫితర్ జరుపుకోవడం సాధారణమే. చాంద్రమాన ఇస్లామిక్ క్యాలెండర్లో షవ్వల్ నెల ప్రారంభానికి దీనిని సూచికగా పరిగణిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos