జగన్‌ను అభినందించిన రామ్‌

జగన్‌ను అభినందించిన రామ్‌

విజయ వాడ : పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందిం చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ అన్నారు. ఆయన్ను అభినందించారు. బుధవారం ఇక్కడ జరిగిన ‘ది హిందూ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ‘నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. కేవలం ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పడమే కాదు. మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. 3,6 48 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల బాధలను తెలుసుకున్న జగన్. సీఎం అయ్యాక వాటిని తీర్చే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్ప నిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ . ఇందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంద’న్నారు. ముఖ్య అతిథిగా జగన్ పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos