మాజీ మంత్రికి క్లీన్​ చిట్​

మాజీ మంత్రికి క్లీన్​ చిట్​

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సీడీ కేసులో మాజీ మంత్రి రమేశ్ జర్ఖిహోళికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. జర్ఖిహోళి అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. కేసును మూసి వేసేందుకు కోర్టుకు నివేదికను సమర్పించింది. సీడీ కేసు విషయంపై రాష్ట్రంలో దుమారం చెల రేగటంతో మంత్రి పదవికి నిరుడు మార్పి 4న రాజీనామా చేశారు. మహిళతో అసభ్యకరమైన రీతిలో ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. రమేశ్తో వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ సీడీలో ఉన్నది తాను కాదని అనేక వీడియోలు, ఆడియోలు విడుదల చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos