రామ్‌దేవ్‌ బాబా అరెస్టు కు డిమాండు

రామ్‌దేవ్‌ బాబా అరెస్టు కు డిమాండు

న్యూ ఢిల్లీ: యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామదేవ్ బాబాను అరెస్టు చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. కరోనా విరుగుడు అంటూ పతంజలి సంస్థ- కరోనిల్ విడుదల చేసింది. అప్పుడు దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని రామ్దేవ్ బాబా ప్రకటించి అందరిని తప్పుదోవ పట్టించారు. ప్రజలను మోసం చేయాలని చూసిన బాబాను అరెస్టు చేయాల’ని పలు ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్య ప్రతాప్ సింగ్ సైతం ఆయనను అరెస్టు చేయాలని న్యూఢిల్లీ పోలీసులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘డియర్ ఢిల్లీ పోలీసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ పేరుతో కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రామ్దేవ్ బాబాను అరెస్టు చేస్తారా? ఇది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలి. దీనికి కఠిన చర్యలు ఉండేలా చూడాలి’ అంటూ ట్విటర్ వేదికగా కోరారు. గత 19న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్దేవ్ బాబా కొరొనిల్ మందును విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos