ఇన్సూరెన్స్‌ కోసం సైరా సెట్‌కు నిప్పంటించారా?

  • In Film
  • May 8, 2019
  • 108 Views
ఇన్సూరెన్స్‌ కోసం సైరా సెట్‌కు నిప్పంటించారా?

మెగస్టార్‌ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నగర శివార్లలోనున్న చిరంజీవికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన భారీసెట్‌లో కొద్ది రోజుల క్రితం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే.అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని చిత్ర బృందం తెలిపినా ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అగ్ని ప్రమాదానికి ప్రొడక్షన్‌ యూటిన్‌ కారణమని ఉద్దేశపూర్వకంగా సెట్‌కు నిప్పంటిచి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం చిత్రం ప్రొడక్షన్‌ యూటిన్‌ సెట్‌కు నిప్పటించి అగ్ని ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసిందని గతంలో చాలా నిర్మాణ సంస్థలు ఇలానే చేశాయని ఇప్పుడు సైరా ప్రొడక్షన్‌ యూనిట్‌ కూడా అదే చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఫాం హౌస్ లో వేసిన సెట్ లో షూటింగ్ పూర్తి కావడంతో కావాలనే ఫైర్ యాక్సిడెంట్ చేశారని అంటున్నారు. ఈ వార్తలు చరణ్ వరకు వెళ్లడంతో.. ”రెండు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్న నాకు ఒకట్రెండు కోట్ల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఏముందని” ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి అగ్నిప్రమాదం కావాలని చేశారో.. లేక నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందో దర్శకనిర్మాతలకే తెలియాలి!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos