హాట్‌ భామల స్ట్రెచ్ ఛాలెంజ్..

  • In Film
  • March 27, 2019
  • 163 Views
హాట్‌ భామల స్ట్రెచ్ ఛాలెంజ్..

యువతరం కథానాయికలు ఏరోబిక్స్‌లు,వ్యాయామశాలల్లో కఠిన వ్యాయామాలు నేర్చుకొని శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవడమే కాకుండా శరీరాన్ని విల్లులా వంచుతూ యువతరానికి ఛాలెంజ్‌లు విసురుతున్నారు.ఇప్పటికే ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌సెల్ఫీ ఛాలెంజ్ .. కికీ ఛాలెంజ్.. డ్యాన్సింగ్ ఛాలెంజ్ అంటూ నిరంతరం యాక్టివ్ గా ఉండే మన అందాల కథానాయికలు లేటెస్టుగా `స్ట్రెచ్ ఛాలెంజ్` అంటూ కొత్త ఛాలెంజ్ ని తలకెత్తుకున్నారు. కాళ్లను రెండు వైపులా 90 డిగ్రీల కోణంలో చాచి నిలకడగా కొన్ని నిమిషాల పాటు అలానే ఉండడం ఈ ఛాలెంజ్ థీమ్‌. అయితే ఇలాంటి ఛాలెంజ్ లు స్వీకరించాలంటే నిపుణులైన శిక్షకులు అత్యవసరం. అలా ట్రైనర్లు లేకుండా ఇలాంటి ఫీట్లు వేశారో ఎముకలు విరగడం ఖాయం. కీళ్లు – నరాలు పట్టేసి అటుపై డాక్టర్ల  చుట్టూ తిరగాలి. అందుకే ఇలాంటివి చూసి ఆస్వాధించాలి. అనవసరమైన ప్రయత్నాలు వద్దు అని సూచిస్తున్నారు.స్ట్రెచ్ ఛాలెంజ్ ప్రస్తుతం మన అందాల కథానాయికల్లో జోరుగా వైరల్ అవుతోంది. పంజాబీ బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించడంతో అసలు వేడి మొదలైంది. ఆ వెంటనే ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే సైతం స్ట్రెచ్ ఛాలెంజ్ ని స్వీకరించి ఇంకా వేడి పెంచింది. ఓవైపు వరుసగా సినిమాల్లో నటించేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న పూజాకి ఇవన్నీ ఎక్కడ కుదురుతున్నాయో. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ సైతం వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. ఇంకా ఈ ఛాలెంజ్ ని స్వీకరించేందుకు ఇతరత్రా ముద్దుగుమ్మలంతా క్యూ కట్టడం ఖాయం అన్నమాట!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos