పాకిస్థాన్‌ జెండాను కప్పుకున్న రాఖీ సావంత్‌..

  • In Film
  • May 9, 2019
  • 132 Views
పాకిస్థాన్‌ జెండాను కప్పుకున్న రాఖీ సావంత్‌..

బాలీవుడ్ తార రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తరచూ సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచేది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.దానికి కారణం ఆమె పాకిస్థాన్ జెండా ముందు నిల్చొని ఫోటోలకు ఫోజివ్వడమే.. పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకుని ఆమె తీయించుకున్న ఫోటోపై ఫ్యాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ జెండాతో భారతీయురాలైన రాఖీ సావంత్ ఫోటోలేంటని ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాఖీని తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.దీంతో ఆ విధంగా ఎందుకు ఫోటోలు దిగాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలిపింది రాఖీ సావంత్. తను నటిస్తోన్న తాజా చిత్రంలో పాకిస్థాన్ యువతిగా నటిస్తున్నాని.. ఆ సినిమాకు సంబంధించి సెట్ లోని ఫోటోలనే తాను పోస్ట్ చేశానని తెలిపింది. ‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ చెప్పడంతో వివాదం కాస్త చల్లారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos