50 ఏళ్లలో ఎంతో ప్రగతి

50 ఏళ్లలో ఎంతో ప్రగతి

హైదరాబాద్ : భారత దేశం గడచిన యాభై ఏళ్లలో అన్ని రకాల క్షిపణులను తయారు చేయడంలో విదేశాలకు దీటుగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కొనియాడారు. రష్యా వంటి దేశాల నుంచి క్షిపణులను కొనుగోలు చేసే స్థాయి నుంచి విదేశాలకు అమ్మే స్థాయికి ఎదిగామని తెలిపారు. శనివారం హైదరాబాద్ బీడీఎల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అన్ని రంగాల్లోనూ భారత్ ముందడుగు వేస్తోందన్నారు. బీడీఎల్ భారత్‌లోనే అతి ముఖ్యమైన రక్షణ సంస్థ అని, అబ్దుల్ కలాం ప్రేరణ తోనే ఇది సాధ్యమైందని అన్నారు. క్షిపణుల వంటి విధ్వంసక ఆయుధాలను తయారు చేయడం సులభం కాదని, ఇప్పుడు ప్రపంచం మనల్ని అనుకరిస్తోందని తెలిపారు. బీడీఎల్ ఉద్యోగులు బిలియన్ డాలర్ల  విలువైన పనులు చేస్తున్నారని ఆయన అభినందనలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos