రాజకీయ ప్రవేశం పై రజనీ పునరాలోచన

రాజకీయ ప్రవేశం పై రజనీ పునరాలోచన

చెన్నై : రాజకీయ రంగ ప్రవేశం పై పునరాలోచనలో పడినట్టు నటుడు రజనీ కాంత్ సంకేతాలు పంపారు. సరైన సమయంలో రాజకీయాల్లో అడుగు పెట్టడంపై తన వైఖరి వెల్లడిస్తానన్నారు. తాను రాసినట్లు బహిర్గతమైన లేఖపై వివరణ ఇచ్చారు. ఆ లేఖను తాను రాయలేదన్నారు. తన ఆరోగ్యం, డాక్టర్ల సూచనలు మాత్రం నిజమని వివరించారు. రజనీ మక్కల్ మండ్రమ్తో చర్చించి రాజకీయ రంగ ప్రవేశం గురించి సరైన సమయంలో ప్రకటి స్తానని చెప్పారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రజనీ రంగ ప్రవేశం ఖాయమని అందరూ భావిస్తున్న దశలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. వైరస్ వ్యాప్తితో తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయని రజనీ రాసినట్టు చెబుతున్న లేఖపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నందున కోవిడ్-19 సోకే ప్రమాదం ఉందని సమూహాల్లో కలువరాదని వైద్యులు ఆయ నకు సూచించినట్టు ఈ లేఖలో ప్రస్తావించారు. తన చుట్టూ ఉన్న వారి బాగోగుల కంటే తన గురించి తాను ఎక్కువగా విచారించబోనని ఈ లేఖలో రజనీ పేర్కొనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావాలనే కోరికతో తాను ఎన్నికల్లో పోటీ చేయనని గత మార్చిలో చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos