మెగా నందమూరి అభిమానులకు కన్నుల పండుగే..

  • In Film
  • October 12, 2019
  • 124 Views
మెగా నందమూరి అభిమానులకు కన్నుల పండుగే..

బాహుబలి విజయంతో దర్శకుడు రాజమౌళి భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై జాతీయస్థాయిలో క్రేజ్ నెలకొంది.2020 మోస్ట్ అవెయిటెడ్ మూవీ జాబితాలో ఆర్ఆర్ఆర్ మొదటిస్థానంలో ఉందంటూ ఈ చిత్రంపై క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక తారక్,చరణ్ మొదటిసారి కలసి నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.చిత్రంలో పోరాట సన్నివేశాలతో పాటు పాటలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.ముఖ్యంగా డ్యాన్స్ల్లో తారక్,చరణ్ ఎవరికి వారే పోటీ కావడంతో ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ఓ పాటను డిజైన్ చేసినట్లు సమాచారం.రెగ్యులర్ కమర్షియల్ గా కాకుండా జాతర లాంటి బ్యాక్ డ్రాప్ లో ఉత్సవాలకు సంబందించిన వాతావరణంలో సాంగ్ ని చిత్రీకరించనున్నారని సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos