రైనా మరో ఘనత

రైనా మరో ఘనత

చెన్నై : ఐపీఎల్‌లో అయిదు వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుకెక్కిన సీఎస్‌కేకు చెందిన సురేశ్‌ రైనా, వంద క్యాచ్‌లను పూర్తి చేసిన తొలి ఫీల్డర్‌గా మరో ఘనత సాధించాడు. బుధవారం రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌పృథ్వీ షా క్యాచ్‌ అందుకుని తన పేరిట రికార్డు సృష్టించుకున్నాడు. ఆర్‌సీబీ ఆటగాడు డివిలియర్స్‌ 84, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 82 క్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వికెట్‌ కీపర్లలో కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ వంద క్యాచులు చేశాడు. 189వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న రైనా 37 బంతుల్లో 59 పరుగులు చేసి చెన్నై విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos