హోసూరులో వడగళ్ల వాన

హోసూరులో వడగళ్ల వాన

హోసూరు : ఇక్కడికి సమీపంలోని బెగేపల్లిపల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం జోరుగా వడగళ్ల వాన పడింది. భారీ వర్షం వల్ల బెగేపల్లి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పాలీహౌస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలి, వానకు సుమారు రూ.25 లక్షలకు పైగా రైతులకు నష్టం 
వాటిల్లిందని లోకేష్ అనే స్థానిక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా పండించిన పంటలను అమ్ముకునే వీలులేక
రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడు గాలి వాన వల్ల మరింతగా నష్టపోయారు. హోసూరు ప్రాంతంలో గత నాలుగు రోజులుగా గాలితో కూడిన వాన ఎక్కువగా కురుస్తున్నది. వర్షంతో పాటు వడగళ్లు పడడంతో రైతులు పండించిన పంటలు నేలకొరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos