కోస్తాంధ్రలో రెండు రోజుల పాటు వానలు

కోస్తాంధ్రలో రెండు రోజుల పాటు వానలు

న్యూ ఢిల్లీ: వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, కేరళ, మహారాష్ట్ర, కొంకణ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ‘నిసర్గ’ తుపాన్ ప్రభావం అనంతరం మహారాష్ట్రలోని సముద్రతీర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. థానే లోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కూడళ్లల్లో వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. అరేబియా సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తర అండమాన్ సముద్ర తీరంతోపాటు కేంద్ర బంగాళాఖాతం తీరాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని వారు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos