సాధారణ వర్షపాతమే

సాధారణ వర్షపాతమే

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దీర్ఘకాలంలో సగటున 102 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాల సీజన్ మామూలుగానే ప్రారంభమైనప్పటికీ ద్వితీయార్థంలో వానలు జోరందుకుంటాయని వివరించింది. ‘ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల సీజన్ బలహీనంగానే మొదలవుతుంది. నాలుగు నెలల పాటు కొనసాగే వర్షాకాలంలో ద్వితీయార్థంలో బాగా వర్షాలు పడతాయి’ అని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ చెప్పారు. దక్షిణ, పశ్చిమ, వాయవ్య ప్రాంతాలలో మంచి వర్షాలు పడతాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. రుతుపవనాల సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సమానంగా వర్షాలు పడతాయి. తూర్పు ప్రాంతంలో ఉన్న బీహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్లో జూలై, ఆగస్ట్ నెలల్లో వర్షపాతంలో లోటు కన్పిస్తుంది. ఈశాన్య ప్రాంతంలో సీజన్ తొలి అర్థభాగంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos