రైల్వేపై కోర్టుకెక్కిన చైనా కంపెనీ

రైల్వేపై కోర్టుకెక్కిన చైనా కంపెనీ

న్యూఢిల్లీ: గుత్తకు ఇచ్చిన రూ.470 కోట్ల రైల్వే సిగ్నలింగ్ పనుల నుంచి తమను తప్పించటాన్ని చైనా ఇంజినీరింగ్ కంపెనీ భారతీయ రైల్వే కు వ్యతిరేకంగా ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. భారత రైల్వేకి చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్సీసీఐఎల్) తమ బ్యాంకు గ్యారంటీని సొమ్ము చేసుకోకుండా అడ్డుకోవాలని చైనా కంపెనీ అభ్యర్ధించింది. గత నాలుగేళ్లుగా చైనా కంపెనీ కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. పనుల్లో తీవ్ర అలసత్వం చూపుతున్నందున గుత్త నుంచి తప్పించినట్లు డీఎఫ్సీసీఐఎల్ పేర్కొంది. కాన్పూర్ దీన దయాళ్ సెక్షన్కు సంబంధించి 417 కి.మీల సిగ్నల్స్ వ్యవస్థ నిర్మాణానికి రెండు సంస్థల మధ్య 2016 లో ఒప్పందం కుదిరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos