కాసేపట్లో రైల్‌ రోకో

కాసేపట్లో రైల్‌ రోకో

న్యూ ఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గురువారం రైల్రోకో కు రైతుసంఘాల పిలుపు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా విన్నవించింది. శాంతియుతంగా రైళ్లను నిలిపివేస్తామని, రైళ్లలోని ప్రయాణికులకు ఆహారం, నీరు సరఫరా చేసి, సాగు చట్టాల ఇబ్బందులను వివరిస్తామని వివరించారు. రైల్రోకో దృష్ట్యా అప్రమత్తమైన రైల్వే అధికారులుఅవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉత్తర భారతదేశంలో పలు రైళ్లు చేసారు. మరికొన్ని ఆలస్యం గా నడుస్తున్నాయి. 20 వేలకుపైగా అదనపు రైల్వే భద్రతా బలగాల మోహరించారు. పంజాబ్, యూపీ, హరియాణా, బంగాల్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వేశాఖ ఆదేశించింది. శాంతియుతంగా రైల్రోకో నిర్వహించాలని అధికారుల విజ్ఞప్తిచ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos