500 చోట్లా మోదీయే పోటీ చేయొచ్చు కదా?

500 చోట్లా మోదీయే పోటీ చేయొచ్చు కదా?

న్యూ ఢిల్లీ: ‘ప్రధాని నరేంద్ర మోదీని చూసి ఓటే యమని భాజపా అడుగు తోంది. మరి 500 చోట్లా మోదీనే పోటీ చేయొచ్చు కదా‘ అని నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. శనివారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఎవరీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అని నిలదీశారు. ‘ప్రజాసేవే నేతలకు పరమావధి కావాలి. ప్రశ్నించడం దేశ పౌరుల బాధ్యత’ అని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయ పక్షాలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేద’ని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర హోదా లేక పోవడంతో ఢిల్లీ, పుదుచ్చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ‘ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసు కోవడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా నడుచు కోవడమే రాజకీయం. విద్వేషాలు చిమ్మటం, కులాలు, మతాల కోసం ఎదుటి వారిని తిట్టడం రాజకీయం అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి గెలవాలనే క్రీడ ఎంతో కాలం సాగదు. ఎవరు ప్రధాని అవుతారో… జనం ఏం కోరుకుంటున్నారో మీరే చూస్తారు. స్థానికంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, సమ ర్థులను లోక్సభకు పంపండి. అంతే చాలు సరైన అభ్యర్థే ప్రధాని అవుతారు. ఒకట్రెండు సార్లు పొరబాటు జరగొచ్చు, ప్రతీసారి పొరబాటు జరగదు’’ అని పేర్కొన్నారు. ‘ఈ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ వారు మాత్రమే తాము చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఎంతో అంకిత భావం , నిబద్ధత ఉన్న అలాంటి పార్టీయే కేంద్రంలో అధికారంలోకి రావాల’ని ఆశించారు. ఏ పార్టీ వారైనప్పటికీ దేశం గురించి ఆలోచించే వారిని ఎన్నుకోవాలని కోరారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా అద్భుతంగా పని చేస్తోందని కితాబిచ్చారు. వాళ్ల ఆలోచనలు, నిర్ణయాలు తనకు బాగా నచ్చాయని అందుకే ఆప్‌కు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికలు జరగాలి కానీ, ఎవరినో కించడపర్చడానికి కాదని, పార్లమెంట్‌లో ప్రజా గొంతుక వినిపించాలంటే కేజ్రీవాల్ లాంటి వారు లోక్‌సభకు వెళ్లాల’ని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos