క్షమాపణ చెప్పారు, మంత్రిని అలానే ఉంచారు

క్షమాపణ చెప్పారు, మంత్రిని అలానే ఉంచారు

న్యూఢిల్లీ: లఖింపూర్లో రైతులను కారుతో తొక్కిచంపించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనిని మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణ చెప్పినా , మంత్రి అజయ్ మిశ్రాను మాత్రం పదవి నుంచి తొలగించలేదని ప్రధాని మోదీని విమ ర్శిం చారు. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్ల మెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కేసు నమోదు చేయా లని నినాదాలు చేశారు. ఇందులో పాల్గొన్న రాహుల్ గాంధీ విలేఖరులతో మాట్లాడారు. ‘ లఖింపూర్ ఘటనపై విపక్షాలు మరోసారి తమ వాణి వినిపించాల్సి వస్తోంది. మంత్రి  కుమారుడు రైతులను పొట్టన పెట్టుకున్నాడు. ఇది మామూలు ఘటన కాదు. దీని వెనుక కుట్ర ఉంద’ని ప్రత్యేక కార్యచరణ బృందం నివేదిక పేర్కొంది. అయినా ప్రధాని దీనిని ఏమాత్రం పట్టించు కోకుండా వ్యవహరిస్తున్నార’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos