500 మంది రైతులు కన్నుమూసినా కన్నుతెరవని మోదీ

500 మంది రైతులు కన్నుమూసినా కన్నుతెరవని మోదీ

న్యూ ఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తన గళాన్ని వినిపించారు. నిరసనల వేదిక వద్ద ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నా రైతులు ఉద్యమానికి కట్టుబడి ఉన్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ట్వీట్కు 500Deaths At Farmers Protest అనే హ్యాష్ ట్యాగ్ను జతపరిచారు. “తమ పొలాలను, దేశాన్ని కాపాడటానికి రైతులు ఒక్కొక్కరుగా నేలరాలుతున్నారు. కానీ వాళ్లు భయ పడటం లేదు. తమ ఉద్యమానికి కట్టుబడి ఉన్నారు’అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిరుడు నవంబర్ 26 నుంచి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ ప్రాంతాల రైతులు దిల్లీ సరిహద్దులో ఆందోళన సాగిస్తున్నారు. గత ఆరు నెలల్లో 500 మందికి రైతులు ఈ ఉద్యమంలో కన్నుమూశారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధర అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos