రాహుల్, ప్రియాంక అరెస్టు

రాహుల్, ప్రియాంక అరెస్టు

లక్నో : గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్, ప్రియాంక గాంధీని గురువారం ఉదయం
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయల్దేరారు. యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్దకు వారి వాహన శ్రేణి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని కార్యకర్తలు,ఇతర నేతలూ అనుసరించారు. పోలీసులు వారినీ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్రంగా ఆగ్రహించారు. ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కిందపడ్డారు. రోడ్డుపై కేవలం ప్రధాని నరేంద్ర మోదీయే నడవాలా? సామాన్యులకు నడిచే హక్కులేదా?’’ అని రాహుల్ తీవ్ర ఆగ్రహించారు. పోలీసులు తనను తోసేసి, లాఠిఛార్జ్ కూడా చేశారని ఆరోపించారు. తనను పోలీసులు తోసేస్తే కింద పడ్డాని వివరించారు. . తాను ఏరకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్టు చేశారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. యూపీలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ప్రియాంక గాంధీ తీవ్రంగా మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos