రాహుల్ ‘కోయ కొమ్ము డ్యాన్స్’

రాహుల్ ‘కోయ కొమ్ము డ్యాన్స్’

మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కోయ తెగ ప్రజలతో మమేకం అయ్యారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణం పరిధిలోని ధర్మాపూర్ నుంచి ఆరంభించిన పాదయాత్రలో కోయ యువతులు, మహిళలు పాల్గొన్నారు. రాహుల్ నెత్తిన కొమ్ముల కిరీటాన్ని పెట్టారు. దాన్ని పెట్టుకుని కొంత సేపు వారితో కలసి నృత్య మాడారు. తర్వాత కొమ్ముల తలపాగా తీసివేసి వారి అడుగులతో అడుగులు వేసారు. గిరిజన యువతులంతా రాహుల్ చుట్టూ చేరి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు.‘‘గిరిజనులు మన ప్రాచీన సంస్కృతి, వైవిధ్యానికి చెందిన భాండాగారాలు. కొమ్ము కోయ గిరిజన డ్యాన్సర్లతో పాదం కలపడాన్ని ఆస్వాదించాను. వారి కళ వారి విలువలను చాటి చెబుతోంది. దీన్ని మనం తప్పకుండా తెలుసుకోవడమే కాకుండా కాపాడుకోవాలి’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos