ర్యాగింగ్ వెర్రితలలు : 150 మందికి గుండ్లు

ర్యాగింగ్ వెర్రితలలు : 150 మందికి గుండ్లు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. ఓ వైద్య విశ్వ విద్యాలయంలో జూనియర్ల పట్ల సీనియర్లు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. గుండ్లు కొట్టించుకుని తమకు సెల్యూట్‌ చేయాలని జూనియర్లను ఆదేశించారు. అంతేనా…కళాశాలకు వచ్చేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించి, క్యూలో రావాలని హుకుం జారీ చేశారు. విధి లేక 150 మంది తొలి ఏడాది విద్యార్థులు గుండ్లు గీయించుకుని, తెల్లటి దుస్తులతో క్యూలో కళాశాలకు వచ్చారు. దీనిని కొంత మంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి కాస్తా వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వైస్‌ ఛాన్సలర్‌ రాజ్‌ కుమార్‌ స్పందించారు. ఈ సంఘటనకు  కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని జూనియర్లకు హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos