పెట్టుబడి కేంద్రీకరణ కోసం మోడీ ఆరాటం

పెట్టుబడి కేంద్రీకరణ కోసం మోడీ ఆరాటం

అమరావతి : పెట్టుబడి కేంద్రీకరణ కోసం మోడీ ప్రభుత్వం ఎక్కడ లేని ఆతృత కనబరుస్తోందని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు విమర్శించారు. సిపి ఐ(ఎం) రాష్ట్ర సమితి సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రసంగించారు. ‘కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన బడ్జెట్ ప్రధానంగా పెట్టుబడి కేంద్రీకరణ (మెటా ప్రైవే టైజేషన్) చుట్టూనే తిరిగింది. కంప్యూటర్ పరిభాషలో మెగాబైట్, గిగా బైట్ అన్న పదాల మాదిరిగానే మెటా ప్రైవేటైజేషన్ను మోడీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మెగా ప్రైవేటైజేషన్ అంటే దేశ ఆర్థిక వ్యవస్థను అయిదారు బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడం. కమ్యూనికేషన్స్, వ్యవసాయొత్పత్తుల మార్కెటింగ్ రంగాల్లో రిలయెన్స్ అంబా నీ , విమానాశ్రయాలు, రేవులు వంటి రంగాల్లో అదానీ గుత్తాధిపత్యానికి, ఫైనాన్స్ రంగంలో రెండు అతి పెద్ద బ్యాంకుల ఆధిపత్యం కల్పించేలా మోడీ ప్రభుత్వం చట్టాలు, ప్రణాళికలు రూపొందిస్తోంది. నాలుగు కోర్ సెక్టార్లలో 10 సంస్థలు మినహా మిగతావాటన్నిటినీ అమ్మేయాలన్నదే నీతి ఆయోగ్ చెబుతున్న నీతి. భారత ఆర్థిక వ్యవస్థను పది మంది కుబేరులే నడిపించాలని, ఆ కుబేరులు యానిమల్ స్పిరిట్ (జంతు శక్తి) తో ఈ రంగాలను దున్నేయాలని మోడీ చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో తీసు కొచ్చిన మూడు నల్ల చట్టాలు దీనిలో భాగమే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, బ్యాంకుల కుదింపును ఈ నేపథ్యంలోనే చూడాలి. దీనివల్ల సామాజిక న్యాయం, సంక్షేమం ప్రమాదంలో పడతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చితికిపోతాయి. వ్యవసాయం, రేవులు, మైనింగ్ తదితర రంగాల్లో తీసుకొస్తున్న చట్టాలు మెటా కేపిటలిస్ట్ చట్టాలు. జిఎస్టి,సర్చార్జి, సెస్సుల పేరుతో రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం హరించివేస్తోంది. విద్య, వ్యవసాయ రంగాల్లో కేంద్రం మితిమీరినజోక్యం వల్ల రాష్ట్రాల హక్కులు కుదించు కుపోతున్నాయి. ప్రజాస్వామ్యంపై కూడా మోడీ ప్రభుత్వం దాడి చేస్తోంది. దిశారవి కేసు ఇందుకొక తాజా ఉదాహరణ. భారత్ బయోటెక్ కంపెనీ తీసుకొచ్చిన కొవాగ్జిన్ టీకాను చూపి కరోనా జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు బిజెపి యత్నిస్తోంది. సైన్స్కు హద్దులు, సరిహద్దులు ఉండవు. దీనికీ జాతీయవాదం రంగు పులమడం బిజెపి సంకుచితత్వానికి నిదర్శనమ’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos