అబే నల్లోడా.. నోరు జారిన పాకిస్థాన్ కెప్టెన్

అబే నల్లోడా.. నోరు జారిన పాకిస్థాన్ కెప్టెన్

ర్బన్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నోరు జారాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆ టీమ్ ప్లేయర్ ఫెహ్లుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన కామెంట్స్ స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. దీంతో ఇప్పుడు సర్ఫరాజ్‌పై సస్పెన్షన్ వేటు పదే ప్రమాదం ఉంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఫెహ్లుక్వాయో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సర్ఫరాజ్ నోరు పారేసుకున్నాడు. అబే నల్లోడా.. మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది? నీకోసం ఏమని ప్రార్థిస్తున్నది అని సర్ఫరాజ్ అన్నాడు. ఆ సమయంలో కామెంట్రీ ఇస్తున్న మైక్ హేస్మన్.. అతను ఏమన్నాడంటూ తన పక్కనే ఉన్న పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రజాను అడిగాడు. చాలా పెద్ద వాక్యమది. చెప్పడం కష్టమంటూ నవ్వుతూ రజా సమాధానమిచ్చాడు. సర్ఫరాజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ట్విటర్ వేదికగా అతని తీరును ఎండగట్టారు. పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా సర్ఫరాజ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos