రబాడాకు వీడ్కోలు

రబాడాకు వీడ్కోలు

ఢిల్లీ
: ఐపీఎల్‌ టైటిల్‌ను ఈసారైనా సొంతం చేసుకోవాలన్న ఢిల్లీ కేపిటల్స్‌కు ప్రధాన బౌలర్‌
రబాడా నిష్క్రమణ శరాఘాతమైంది. గాయం వల్ల చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో రబాడా డగౌట్‌కే
పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైంది. ప్రపంచ కప్పు దగ్గర పడుతున్న వేళ…ఆ
గాయం మరింత విషమించకుడా స్వదేశానికి వచ్చేయాలంటూ దక్షిణాఫ్రికా బోర్డు అతనిని ఆదేశించింది.
ప్రపంచ కప్పులో దక్షిణాఫ్రికా జట్టుకు రబాడానే ప్రధాన ఆయుధం. ఢిల్లీ తరఫున ఆడుతూ
12 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టాడు. అతడు రాణించడంతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఢిల్లీ,
తదుపరి విజయాలపై చాలా కష్టపడాల్సి ఉంది. ఢిల్లీని వీడుతుండడం తనకూ బాధ కలిగిస్తోందని,
ఈ సీజన్‌ను తాను ఎప్పటికీ మరిచిపోలేనని రబాడా వ్యాఖ్యానించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos