సంబంధాల మెరుగునకు సూచిక

సంబంధాల మెరుగునకు సూచిక

ఇస్లామాబాద్: భారత్ పాక్ సత్సంబంధాలు మెరుగునకు కర్తార్పూర్ నడవ ఒక సూచికని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ మూద్ ఖురేషీ శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ‘ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడమే కర్తార్ పూర్ నడవ ఆశయం. దీన్ని కేవలం ఒక నడవగా కాకుండా ఆంతర్యాన్ని భారత్ గ్రహించాలి. రెండు దేశాల మధ్య శాంతిని స్థాపించడం కోసం భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే పాక్ రెండు అడుగులు ముందుకేస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతూ వస్తున్నారు. కశ్మీర్పై భారత్ అవలంబించే విధానాలపైనే రెండు దేశాల ద్వైపాక్షిక సంబం లు ఆధార పడి ఉన్నా య’ని వివరించారు. కర్తార్పూర్ కారిడార్ని ఆయన బెర్లిన్ గోడతో పోల్చారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలను విడదీసి నిర్మించిన బెర్లిన్ గోడను కూల్చేసిన తర్వాత ఐరోపా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అలాగే కర్తార్పూర్ కారిడార్ కూడా దక్షిణాసియా స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆశించారు. పాకిస్థాన్లోని దర్బార్ సాహిబ్ను పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో గల గురునానక్ మందిరాన్ని కర్తార్పూర్ కారిడార్ కలుపుతోంది. సిక్కు మతగురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ నేడు ఈ కారిడార్ను ప్రారంభించారు. ఈ రోజు 500 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బృందం కర్తార్పూర్ వెళ్లింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos