ప్రణాళిక లేని ప్రధాని

ప్రణాళిక లేని ప్రధాని

హైదరాబాద్: ‘ఏ మాత్రం ప్రణాళిక లేకుండా లాక్డౌన్ను ప్రధాని మోదీ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించేటప్పుడు వలస కార్మికుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేద’ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్కవారం ఇక్కడ విమర్శించారు. ‘నగరాలోల పనిచేస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖాండ్ వలస కూలీల గురించి ప్రధాని ఏమాత్రం ఆలోచించనే లేద’ని తప్పుపట్టారు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ బయలేదేరిన 12 ఏళ్ల అమ్మాయి 100 కిలోమీటర్లకు పైగా నడిచి, పూర్తి అలసటతో కన్నుమూయడమే ఇందుకు ఒక ఉదాహరణ అని ఒవైసీ అన్నారు. ‘వసల కార్మికుల ఇక్కట్లు ఇన్నీ అన్నీ కావు. లాక్డౌన్ భయంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇళ్లకు కూడా చేరలేని దయనీయ పరిస్థితిలో ఉన్నారు’ అని ఆయన చెప్పారు. వలస కార్మికుల్లో ఎక్కువ మందికి బ్యాంకు అకౌంట్ కానీ , రేషన్ కార్డు కానీ లేవని, అలాంటి వారికి ‘ఆధార్’ కార్డు నంబర్ను బట్టి డబ్బు సాయం చేయాలన్నారు. గోదాముల్లో నిల్వచేసిన బియ్యాన్ని అసరమైన ప్రజలకు పంచాలని కోరారు. కేంద్రం ఆమోదించిన రూ.30,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేసి, ఆ మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకానికి పంచాలని కోరారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం ప్లాన్ ఏవిధంగా ఉండబోతోందని అడిగినప్పుడు, వలస కార్మికుల పరిస్థితి ఏమిటి? వాళ్ల ఉద్యోగాలు మళ్లీ వాళ్లకు వస్తాయా? అని ఒవైసీ ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos