రైల్వే ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

రైల్వే ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

న్యూ ఢిల్లీ: ప్రైవేట్ సంస్థలతో రైళ్లు నడిపేందుకు రంగం సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా దిల్లీ-లఖ్నవూ, అహ్మదాబాద్-ముంబయి మధ్య సెంట్రల్ తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపే బాధ్యతను రైల్వే శాఖ ఐఆర్సీటీసీకి అప్పగించింది. టికెట్ల ధరల్ని కూడా ఆ సంస్థే నిర్ణయించనుంది. మూడేళ్ల పాటు ఐఆర్సీటీసీ ఆ రైళ్లను నడపనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయా ణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో రాయి తీలు, పాస్లు చెల్లవు. వీటిలో తనిఖీలూ ఉండవు. రైళ్లను రైల్వే శాఖ సిబ్బందే నడుపుతారు. లోకో పైలెట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు కూడా రైల్వే సిబ్బందే. శతాబ్ది రైళ్ల మాదిరిగానే వీటి సేవ   లుంటాయని బోర్డు వివరించింది. లోపల, వెలుపల ప్రకటనలు ఇచ్చేం దు కు ఐఆర్సీటీసీకి అధికారం ఉంటుంది. భద్రతలో రాజీ పడకుండా బోగీల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకునేందుకు అవకాశం కల్పించా రు. ఒక వేళ ఈ రైళ్లలో ప్రమాదాలు గనక జరిగితే పరిహారం, చికిత్స విషయంలో ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos