పంజ్​ షీర్​ తిరుగుబాటు దళాలతో తాలిబన్ల చర్చలు

పంజ్​ షీర్​ తిరుగుబాటు దళాలతో తాలిబన్ల చర్చలు

కాబూల్ : పంజ్ షీర్ తిరుగుబాటు దళాలతో 40 మంది సభ్యుల తాలిబన్ల బృందం సమావేశమైంది. చర్చల ఫలితం ఇంకా బహిర్గతం కాలేదు. ఖొరాసన్ ప్రజల విలువలను తాలిబన్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అన్న రెండు మార్గాలే వారికి ఉన్నాయని తిరుగుబాటు దళాలు ట్వీట్ చేసింది. పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని సంగతి తెలిసిందే. దీంతో చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగు బాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉన్నాయని ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలె చెప్పారు. దక్షిణ్ ప్రావిన్స్ కు ఆనుకుని ఉన్న అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన తాలిబన్లను , తిరుగుబాటు దళాలు అడ్డుకున్నాయని పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ చెప్పారు. తాలిబన్లతో జరిగిన హోరాహోరీ పోరులో చాలా మంది చనిపోయారని తెలిపారు. కాగా, ఇప్పటిదాకా తాలిబన్ల అధీనంలోలేని ఏకైక ప్రావిన్స్ పంజ్ షీర్ కావడం విశేషం. ఇప్పుడు దానినీ చర్చల ద్వారా వారు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos