పబ్జీ ఆడుతూ బ్రైయిన్‌ స్ట్రోక్‌..

పబ్జీ ఆడుతూ బ్రైయిన్‌ స్ట్రోక్‌..

స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి పది మంది యువకుల్లో ఐదు మంది తప్పకుండా ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీకి బానిసలై ఉంటారనేది ఎవరూ కాదనలేని వాస్తవం.చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా రాత్రిపగలు తేడా లేకుండా ఎప్పుడూ పబ్జీ ఆడుతూ శారీరక,మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.పబ్జీ మాయలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది హత్యలకు సైతం తెగబడ్డ ఘటనలు అనేకం వెలుగు చూశాయి.తాజాగా పబ్జీకి బానిసై మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిరంతరం పబ్జీ ఆటలో నిమగ్నమై మెదడు నిష్క్రియం చెంది మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన హర్షల్‌ (27) రెండేళ్లుగా పబ్జీ ఆడుతున్నాడు. ఇతర పనీ చేయకుండా అదే పనిగా పబ్జీ ఆడుతుండడంతో ఆదివారం గుండెనొప్పి వచ్చింది.దీంతో హర్షల్ను అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుతో పాటు అతడికి ఒకేసారి బ్రెయిన్స్ట్రోక్కూడా వచ్చిందని వైద్యులు చెప్పారు. హర్షల్ మెదడులోని కణజాలం చిట్లి తీవ్ర రక్తస్రావం అయిందని చెప్పారు. దీంతో రోజు ఉదయం హర్షల్మృతి చెందాడని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos