పులస వచ్చేసిందోచ్‌

పులస వచ్చేసిందోచ్‌

రాజోలు: ‘ పుస్తెలమ్మి అయినా పులస తినాలనే ‘ది ఇక్కడి సామెత. అందుకు తగ్గట్టు పులసలు విపణిలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం వాటి ధర కిలోరూ.ఐదు వేలు మాత్రమే. గోదావరి వరద నీరు బంగాళా ఖాతంలోకి ప్రవహించే పాయల్లోకి ఈ కాలంలో వచ్చే చేప ధర చాలా ఎక్కువ. ఎర్రటి వరద నీటిలో గుడ్లు పెట్టడానికి ఈ పులస చేపలు ఈదుతూ ఎదురు వస్తుంటాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి నది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశం వరకూ పులసలు లభిస్తాయి. వీటిని చెరువుల్లో పెంచడానికి వీలుండదు. ఒడిశా తీరంలోనూ ఇవి లభిస్తున్నా గోదావరి జిల్లాల్లో లభించే చేపలకే రుచి అధికమని భోజన ప్రియుల మదింపు. సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చే ఇలస చేప, రెండు రోజుల పాటు ఎదురు ఈదితే పులసగా మారుతుంది. ప్రస్తుతం మలికిపురం, రాజోలు, కేశనపల్లి, దిండి అంతర్వేది మార్కెట్, సఖినేటిపల్లి, నరసాపురం, రావులపాలెం, తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో ఇవి అమ్మకానికి సిధ్ధంగా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos